Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ చెలగాటమాడుతున్నదని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి విమర్శించింది. వెబ్సైట్ హ్యాకింగ్, పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలీ ఉల్లా ఖాద్రీ, కె ధర్మేంద్ర సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనీ, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.