Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్కార్ రావడంపై డీజీపీ హర్షం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు..' పాటకు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు రావడం పట్ల రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. భారత దేశంలోని తెలుగు భాషకు చెందిన ప్రాంతీయ చిత్రంలోని పాటకు కీర్తివంతమైన అవార్డు రావడం తెలుగు ప్రజలకే గాక దేశానికి కూడా గర్వకారణమని ఆయనన్నారు. ఇంతటి విఖ్యాత అంతర్జాతీయ అవార్డును సాధించినందుకు గానూ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులకు, నటులకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ అవార్డులను తెలుగు చిత్ర పరిశ్రమ సాధించాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
వాటర్ స్పోర్ట్స్‌లో బహుమతులు
సాధించిన పోలీసులకు డీజీపీ అభినందనలు
హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఆలిండియా పోలీసు వాటర్ స్పోర్ట్స్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర పోలీసులకు డీజీపీ అభినందనలు తెలియజేశారు. ఈనెల 6 నుంచి 12 వరకు జరిగిన ఈ వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణ స్పెషల్ బెటాలియన్స్కు చెందిన పురుషోత్తమ్ రెడ్డి, మరో కానిస్టేబుల్ వెంకటేశ్‌లు వెండి పతకాలను సాధించారు. వీరిద్దరిని డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అంజనీ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.