Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓడీఎఫ్ ప్లస్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందనీ, రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 4 తాజా సర్వేల్లో మరోసారి తెలంగాణ ప్రతిభ కనబర్చిందని పేర్కొన్నారు.
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు, ఇండ్ల విభాగాల్లో 100 శాతం స్వచ్చత, స్వచ్ఛ సర్వే క్షణ్ గ్రామీణ సర్వే లోనూ 100 శాతం స్వచ్ఛత సాధించామని తెలిపారు.దేశంలో అత్యధిక టాయిలెట్స్ ఉన్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్‌తో పని లేకుండానే డబుల్ ప్రతిభ కనబర్చటం గొప్ప పరిణామం అని పేర్కొన్నారు. కేంద్రానికి, సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు ఇవ్వటమే కాదు, నిధులు కూడా ఇవ్వాలంటూ యథావిధిగా ఆయన కేంద్రానికి చురకలు వేశారు. పంచాయతీరాజ్ అధికారులు, ఉద్యోగులను అభినందించారు. డబుల్ ఇంజిన్‌కు, డబుల్ పని చేస్తున్న సర్కార్లకు ఇదీ తేడా అంటూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.