Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను యూకే తెలంగాణ అసోసియేషన్(టాక్) ఉపాధ్యక్షురాలు శుష్మణరెడ్డి ఖండించారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివి, ఎంపీవి మహిళల పట్ల వ్యవహరించాలో, ఎలా మాట్లాడాలో తెలియకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం సమాజం సహించదని హితవు పలికారు. భాష రాకపోతే నేర్చుకోవాలనీ, ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించారు. అలాగే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.