Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారని విమర్శించారు.దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.