Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో: వేతన సవరణ డిమాండ్ చేస్తూ ఆందోళనల బాట పట్టిన విద్యుత్ ఉద్యోగులు వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీపై జేఏసీ నేతలతో చర్చలు జరుగు తున్నందున ముందుగా నిర్ణయించిన ఆందోళనలను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నా మన్నారు. ఈ నెల 14వ తేదీ పాల్వంచ, 17న ఎన్పీడీసీఎల్ ఎదుట, 21న ఎస్పీ డీసీఎల్ ఎదుట జరగాల్సిన ఆందోళనా కార్యక్రమాలు వాయిదా వేసినట్టు తెలిపారు.