Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీక్‌లో కీలక పాత్ర పోషించిన రేణుక, ప్రవీణ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును పోలీసులు ఛేదిం చారు. ఈ కేసులో 9 మంది నింది తులను టాస్క్ఫోర్సు, బేగంబజార్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసు కున్నారు. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి డీసీపీ కిరణ్కార్ వివరాలు వెల్లడించారు. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.ప్రవీణ్ కుమార్ కార్యదర్శి పీఏగా కొనసాగుతున్నాడు. తన తండ్రి మృతిచెందడంతో ప్రవీణ్‌కు 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. మణికొండకు చెందిన ఏ.రాజశేఖర్ టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన రేణుకకు 2018లో వనపర్తిలో గురుకులంలో హిందీ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ప్రవీణ్‌కు రేణుకకు పరిచయం ఏర్పడింది. మహబూబ్‌నగర్‌లో నివాసముండే రేణుక సోదరుడు కె.రాజేశ్వర్‌కు ఆర్థిక ఇబ్బందులు తల్తెడంతో సోదరికి తన గోడు చెప్పుకునేవాడు. ఈ క్రమంలో డబ్బులు సంపాదించాలని ఆశించిన రేణుక టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రశ్నాపత్రాలను లీక్ చేసేందుకు ప్రవీణ్ సహాయాన్ని కోరింది. లక్షల్లో డబ్బులు వస్తాయని ఆశించిన ప్రవీణ్ కూడా అందుకు అంగీకరించాడు. రేణుక ఈ విషయాన్ని తన భర్త ఎల్.ధాక్య తోపాటు సోదరునికి చెప్పింది. టీఎస్పీఎస్సీలో పరీక్ష ప్రశ్నపత్రాలు అన్నీ డిజిటల్ ఫార్మాట్లో కంప్యూటర్లో ఉండటంతో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను రహస్యంగా ప్రవీణ్ తెలుసుకున్నాడు. ఈనెల 2న అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏ.రాజశేఖర్ సహాయంతో కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రాలను ఎవరికీ అనుమానం రాకుండా పెన్డ్రైవ్ల్లో డౌన్లోడ్ చేశారు. ఆ తర్వాత రేణుకకు సమాచారమిచ్చాడు. 5వ తేదీన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష ఉండటంతో పరీక్షా పత్రాలున్నాయి కవాలా అంటూ రాజేశ్వర్ తనకు తెలిసిన మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌ను సంప్రదించాడు. అయితే, తాను ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్నానని, కావాలంటే తన స్నేహితులను సంప్రదించాలని చెప్పాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన కె.నీలేష్ నాయక్, పి.గోపాల్ నాయక్‌ను రాజేశ్వర్ సంప్రదించాడు. ఒక్కొక్కరిని రూ.10 లక్షల చొప్పున అడిగాడు. వారు అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేమని చెప్పడంతో ఇద్దరి నుంచి రూ.13.50లక్షలు పుచ్చుకున్నారు. అందులో నుంచి రూ.5లక్షలు ప్రవీణ్‌కు చెల్లించారు. పేపర్స్ తీసుకున్న అనంతరం మరో రూ.5లక్షలు చెల్లించారు. డబ్బులిచ్చిన ఇద్దరు అభ్యర్థులను మహబూబ్‌నగర్‌లోని రేణుక తన ఇంట్లోనే ప్రిపరేషన్ చేయించింది. పై గదిలో ఆమె సోదరుడు కె.రాజేశ్వర్ ఉండేవాడు. రెండ్రోజుల ప్రిపరేషన్ తర్వాత పరీక్షా కేంద్రం వద్దకు రేణుక, ఆమె భర్త అభ్యర్థులను తీసుకెళ్లి విడిచిపెట్టారు. పరీక్ష రాసిన తర్వాత విషయం లీక్ కావడంతో టీఎస్పీఎస్సీ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు.