Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమా న్యాల్లోని అన్ని పాఠశాలల్లో బుధ వారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవ సేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎండల తీవ్రత వీపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒంటిపూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత వారు ఇంటికి వెళ్తారని వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రకటించారు.