Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల కంటి పరీక్షలకు అపూర్వ స్పందన: రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ- గజ్వేల్
'కేసీఆర్ సారు కంటి శిబిరం ఏర్పాటు చేసి ఎంతో మందికి మేలు చేస్తుర్రు.. ప్రయివేటు దవా ఖానలకుపోతే లక్షల రూపాయలు కావాలి. మేం ఎలా పెడతాం. అందుకే కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించు కుంటున్నాం..' అంటూ కంటి వెలుగు శిబిరం తనిఖీకి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు మహిళలు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాత మున్సిపల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి తనిఖీ చేశారు. అక్కడ కూర్చున్న మహిళలతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరాలన్నారు. ప్రతి ఇంటిలో వెలుగు నింపేందుకు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుంటే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు అందరూ చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఏఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి, వైస్ చైర్మెన్ జాకీర్, స్థానిక కౌన్సిల్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుతు, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.