Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90.40 శాతం ఓటింగ్
- జోగులాంబ-గద్వాల్ జిల్లాలో అత్యధికంగా 97.15 శాతం
- అత్యల్పంగా హైదరాబాద్‌లో 82.25శాతం
- 16న ఓట్ల లెక్కింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా పోలింగ్ 90.40శాతం నమోదైంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో 90శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో 80శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగులాంబ-గద్వాల్ జిల్లాలో 97.15 శాతం నమోదుకాగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 82.25శాతంగా నమోదైంది. టీఎస్ యూటీఎఫ్ నుంచి పాపన్నగారి మాణిక్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, ఎస్టీయూటీఎస్ నుంచి భుజంగరావు, బీజేపీ నుంచి ఏవీఎన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్దన్‌రెడ్డి, అయినేని సంతోష్‌కుమార్, బీసీటీఏ నుంచి ఎస్.విజరుకుమార్ ఇలా మొత్తం 21 మంది పోటీలో ఉన్నారు.
బ్యాలెట్ బాక్సులన్నీ సరూర్‌నగర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. ఈనెల 16వ తేదీ ఉదయం 6గంంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కరోజులోనే ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్పెషల్ ఆఫీసర్ల నియామకం
ఈనెల 16 ఓట్ల లెక్కింపు సందర్భంగా 8 మంది అదనపు కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌ను కేటాయించారు. వీరిలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జోగులాంబగద్వాల్ జిల్లా అదనపు కలెక్టర్ అపూర్ చౌహాన్, నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ ఎం.మనుచౌదరీ, నారాయణపేట్ అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్(ఎన్నికలు) పంకజ, మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణగోపాల్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏ.నర్సింహ్మారెడ్డి ఉన్నారు. ఐదుగురు ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. కౌంటింగ్ హాల్-1కు పంకజ, సీతారామారావు, కౌంటింగ్ హాల్-2కు డి.వేణుగోపాల్, ఏ.నర్సింహ్మారెడ్డిని నియమించారు. వీరితోపాటు కౌంటింగ్ సిబ్బంది, స్టేషనరీ, బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలింపు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు అధికారులను కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీచేశారు. వికారాబాద్ జిల్లాలో 1890 ఓట్లకుగాను 1790 ఓట్లు పోలయ్యాయి. దోమ, బొంరాస్‌పేట, పెద్దేముల్ మండలాల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాలను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. అదనపు ఎస్పీమురళీధర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 9,186 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 31పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7,879 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా కిల ఘనపూర్‌లో 11 మంది ఓటర్లు ఉండగా.. 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు.
జిల్లా పేరు ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతం
మహబూబ్‌నగర్ 3461 87.75
నాగర్‌కర్నూల్ 1822 93.96
వనపర్తి 1335 93.48
జోగులాంబగద్వాల్ 877 97.15
నారాయణపేట్ 664 93.77
రంగారెడ్డి 9186 86.90
వికారాబాద్ 1890 94.76
మేడ్చల్-మల్కాజ్గిరి 6536 83.54
హైదరాబాద్ 3949 82.25
మొత్తం 29,720 90.40