Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిరోజు 4,793 మందికి స్క్రీనింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజు 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 975 మందికి అవసరమైన మందులు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కరీంనగర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం విదితమే. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకే వైద్య సేవలు అందిస్తారు. మొత్తం 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తొలి మంగళవారం కావడంతో 100 కేంద్రాల్లో స్క్రీనింగ్ నిర్వహించారు.