Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీక్‌చేసిన ప్రవీణ్‌కు గ్రూప్-1లో అత్యధిక మార్కులు
- టీఎస్పీఎస్సీని రద్దు చేయాల్సిందే : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసీఆర్‌దీ ప్యాకేజీ, లీకేజీ, నిరుద్యోగులకు డ్యామేజీ చేకూర్చే సర్కార్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ లీక్ అవుతున్నాయనీ, వాటిని వెంటనే రద్దు చేసి సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేపర్‌ను లీక్ చేసిన ప్రవీణ్‌కు గ్రూప్-1లో అత్యధిక మార్కులు వచ్చాయని తెలిపారు. ప్రవీణ్ రాసిన కేంద్రంలో పరీక్షను మధ్యాహ్నం నిర్వహించారని పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో జరుగబోయే పరీక్షలకు సంబంధించిన పరీక్షపత్రాలన్నీ కేసీఆర్ టీమ్‌కు లీక్ అయ్యాయని ఆరోపించారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రం లీకైందని గుర్తుచేశారు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ చైర్మెన్ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఆయనకు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యమని పేర్కొన్నారు. అసలు సెక్షన్ ఆఫీస్ సిస్టమ్‌లో ప్రశ్నపత్రాల డేటాను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. లీకేజీలపై న్యాయ విచారణ జరపాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే నిరుద్యోగులతో టీఎస్పీఎస్సీ, ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.