Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనులను పారిశ్రామికవేత్తలను చేసేందుకు వీలుగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టీనా జెడ్ చొంగ్తూ తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ, ట్రైకార్ ఆధ్వర్యంలో అమలవుతున్న సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెనర్ షిప్, ఇన్నోవేషన్ పథకంలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి 50 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్బీఐ శిక్షణా సంస్థలో వారికి ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మెన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, ఎస్బీఐ జీఎం మంజు శర్మ పాల్గొన్నారు.