Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనున్నది. మధ్యాహ్నం 3 గంటలకు 'లే మెరిడియన్ హౌటల్'లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరవుతారు. మహిళా బిల్లుపై కవిత ఆధ్వర్యంలో ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.