Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఎల్బీస్టేడియం ప్రాంగణంలో నటరాజ్ అకాడమీ, మాంగళ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కేసీఆర్ ఉండగా, ప్రతి రోజూ కళా పండుగే' అనే నినాదంతో జానపద కళాకారుల తలపెట్టిని మహార్యాలీని వినోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలను, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తున్నదన్నారు. జానపద కళలు కనుమరుగు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కొమురవెల్లి వంటి ప్రధాన ఆలయాల్లో సాయంత్రం పూట భక్తుల కోసం కళా రూపాలను ప్రదర్శించేందుకు జానపద కళాకారులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, నిర్వాహకులు బత్తిని కీర్తి లతాగౌడ్, గిరి, శరత్చంద్ర, గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.