Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే విచారణ జరిపించాలి: ఆరోగ్యశ్రీ సీఈఓకు సీపీఐ(ఎం) నగర కమిటీ మెమోరాండం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లోని ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో మందుల దందాపై విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆరోగ్యశ్రీ సీఈఓకు మెయిల్ ద్వారా మెమోరాండం పంపించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి..
- ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలో పేషెంట్లకు అవసరం లేకపోయినా 15 నుంచి 20 రకాల మెడిసిన్స్ 30, 60, 90 క్వాంటిటీలో ప్రిస్క్రిప్షన్ రాయిస్తూ సరఫరా చేస్తున్నారు. నిజంగా పేషెంట్లు ఈ మందులను వాడితే అనారోగ్యానికి గురవుతారు. కానీ, ప్రిస్క్రిప్షన్లలో రాసే మందులను అక్కడ పనిచేసే కొందరు బయటి దుకాణాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
- ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల లాభాల కోసం అధిక మొత్తంలో మెడిసిన్స్ ఇండెంట్ పెట్టి తెప్పిస్తున్నారు. వాటిని పేషెంట్ల పేరుతో పెద్ద మొత్తంలో రాయించి బయట అమ్ముకుంటున్నారు.
- ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వెల్నెస్ కేంద్రాల్లోని ఫార్మాసిస్టులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏ మందులు ఎంత మొత్తంలో ఇండెంట్ పెట్టాలో ఆదేశాలు జారీచేస్తున్నారు. వెల్నెస్ కేంద్రాల్లో జేఈఓ, హెచ్ఆర్ల కనుసన్నలోనే ఈ దందా నడుస్తోంది. తాము చెప్పినట్టు ఫార్మాసిస్టులు ఇండెంట్లు పెట్టకపోతే హెచ్ఆర్, జేఈఓలు నేరుగా ఇండెంట్లు పెట్టి తెప్పించుకుంటున్నారు.
- ఇన్చార్జీల నిర్లక్ష్యం కారణంగా డయాలసిస్ పేషెంట్ల కోసం ఇటీవల ప్రత్యేకంగా ఇండెంట్లు పెట్టి తెప్పించిన రూ.3లక్షల విలువైన మెడిసిన్స్ కాలం చెల్లిపోయాయి.
- డాక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వ్యక్తులు పేషెంట్లకు వివిధ టెస్టుల కోసం ప్రయివేటు ఆస్పత్రులకు పంపిస్తూ నజరానాలు పొందుతున్నారు.
- ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రానికి ప్రతి రోజూ 300 మంది పేషెంట్లు వస్తుంటారు. 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇన్చార్జీలు, డాక్టర్లు, అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. ఒక్క ప్రభుత్వ డాక్టర్నూ నియమించకపోవడం చాలా బాధాకరం. బాధ్యతలేని ఇన్చార్జీల కారణంగా వెల్నెస్ కేంద్రాలు నియంత్రణ కోల్పోతున్నాయి.
- ఈ కేంద్రంలో వయసుపైబడిన డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. యువ వైద్యులను నియమించాలి. అవసరానికి మించి డెంటల్ డాక్టర్లు ఉన్నారు. వీరికి ఇతర బాధ్యతలు అప్పగించి అవసరమైన స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి.
- టెస్టుల కోసం ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలోనే 'తెలంగాణ డయాగస్టిక్ సెంటర్' ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డాక్టర్లను వెల్నెస్ కేంద్రానికి ఇన్చార్జీలుగా నియమించాలి. మందుల దందా చేస్తున్న ఇన్చార్జీలను తక్షణమే తొలగించాలి.