Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొననున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహారాష్ట్రలోని కాందార్లోహలో మార్చి 26న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నది. ఆ సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉండనున్నాయి. మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన పలువురు సీనియర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొచ్చారు. మంగళవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్తో ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్, ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షులు దత్తా పవార్, ఆ పార్టీ యువజన విభాగం కార్యదర్శి శివరాజ్ ధోంగే, అధ్యక్షులు హన్మంత్ కళ్యాంకర్, నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మనోహర్ పాటిల్ భోసికర్, అధికార ప్రతినిధి డాక్టర్ సునీల్ పాటిల్, లోహ అధ్యక్షులు సుభాష్ వాకోరే, కాందార్ అధ్యక్షులు దత్తా కరమాంగే, జిల్లా పరిషత్ సభ్యులు, అడ్వకేట్ విజయ్ ధోండగే, ప్రవీణ్ జాతేవాడ్, సంతోష్ వార్కాడ్, స్వాప్నిల్ ఖీరే సమావేశమయ్యారు.బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ అనుచరులు, కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, నాందేడ్ ఇన్చార్జి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.