Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ మంత్రి కె.విజయ రామారావు భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. మంగళ వారం ఆయన నివాసానికి వెళ్లిన సీఎం... విజయరామారావు కుమారుడు, కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయిన వారిని ఓదార్చారు. అంత్యక్రియలకు సంబంధిం చిన ఏర్పాట్ల గురించి సీఎం ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, కమిషనర్ సి.వి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.