Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తి మస్తిష్కాన్ని కదిలించే శక్తి పుస్తకానికే ఉంది : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
- నవతెలంగాణ పుస్తక ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ - నల్లగొండ
కంప్యూటర్ మనిషిని యంత్రంగా మారిస్తే, పుస్తకం మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. పుస్తకాలు మస్తిష్కానికి వ్యాయామం లాంటివన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ముందు ఏర్పాటు చేసిన నవతెలంగాణ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుస్తక ప్రపంచాన్ని ఎంత విస్తరిస్తే అన్ని జ్ఞాన సమాజాలు నిర్మితమవుతాయన్నారు. సమస్యల్లో, దుఃఖ సమయాల్లో జీవన గమ్యం కోసం తపించే వ్యక్తులకు పుస్తకాలు లైట్ హౌస్లా మంచి దారి చూపిస్తాయన్నారు. పుస్తకాలు ఆత్మశక్తిని ప్రసాదిస్తాయన్నారు. చరిత్ర గతిని మార్చిన పుస్తకాలే తెలంగాణ సమాజాన్ని మార్చగలిగాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రాసిన 'తెలంగాణలో ఏం జరుగుతుంది' అన్న పుస్తకం రాష్ట్రంలో గొప్ప కదలిక తీసుకొచ్చిందన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ప్రజలకు తెలంగాణ సాహిత్యం దిశ నిర్దేశం చేసింది పుస్తకాలే అన్నారు. 14 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉన్న శక్తి, అక్షర శక్తి, పుస్తక శక్తి మాత్రమేనని నమ్మేవాడినని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్‌్ మందడి సైదిరెడ్డి, నాయకులు పంకజ్ యాదవ్, కటికం సత్తయ్యగౌడ్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, గోగు శ్రీనివాస్, నవతెలంగాణ బుకహేౌస్ మేనేజర్ కృష్ణారెడ్డి, నవతెలంగాణ బుకహేౌస్ ఇన్చార్జి రఘువరణ్, నల్లగొండ డెస్క్ ఇన్చార్జి మేకల వరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.