Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోళ్లపాడు ఛానల్ అభివృద్ధే నిదర్శనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''ఖమ్మం జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మురికికూపంగా ఉండే గోళ్లపాడు ఛానల్‌ను అభివృద్ధి చేసిన తీరే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు'' అని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొంది. గోళ్లపాడు ఛానల్‌ను ముఖ్యమంత్రి హామీ పథకం కింద రూ.70 కోట్లతో ఆధునీకరించి, ఉద్యానవన పార్కులు, క్రీడా ప్రాంగణాలు గా అభివద్ధి చేసినట్టు తెలిపారు. రోజువారీ రెండు కోట్ల లీటర్ల సామర్ధ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రంతో దీనిని అనుసంధానం చేయడం వల్ల ఖమ్మం నగరంలోని 22 కాలనీలవాసులకు దుర్గంధం, వరద ముంపు నుంచి విముక్తి కలిగించినట్టు అయ్యిందన్నారు. గోళ్లపాడు ఛానల్ అభివృద్ధి పనుల్లో భాగంగా 10.60 కిలోమీటర్ల సీవరేజి పైపులైన్లు వేసి, మురుగునీటిని శ్రీనివాసనగర్ లో నెలకొల్పిన 20 ఎల్.ఎం.డి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు మళ్లించారు. అలాగే వరద ముంపు నివారణలో భాగంగా 6.50 కిలోమీటర్లు పొడవున స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు నిర్మించి వరద నీటిని మున్నేరు నదిలోకి వెళ్లే వెసులుబాటు కల్పించినట్టు వివరించారు. ఈ ఛానల్ ఆధునీకరణ కోసం 812 ఆక్రమణలను తొలగించి, అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు''వెలుగుమట్ల లే అవుట్'లో పునరావాసం కల్పించారు. రోడ్లు, విద్యుత్తు, వీధిదీపాలు, మరుగుదొడ్లు, తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించినట్టు తెలిపారు. ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకులగుట్ట, వనజీవి రామయ్య పార్క్, జూబ్లీ క్లబ్ తదితర ప్రాంతాల్లో విశాలమైన పార్కింగ్ స్థలాలు, అందమైన శిల్పాలు, పెయింట్ చేసిన గోడలతో ప్రవేశ ద్వారం తోరణాలు, ల్యాండ్‌స్కేపింగ్ రౌండ్ బెంచీలు, పచ్చదనం, పచ్చిక బయళ్లు, ఫౌంటైన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే ఓపెన్ జిమ్‌లు, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, చెస్ ప్లేయింగ్ టేబుళ్లు, మెగా చెస్ బోర్డ్, స్కేటింగ్ రింక్, బ్యాడ్మింటన్ కోర్ట్లు, ఖోఖో, వాలీబాల్ కోర్ట్లు, బాస్కెట్‌బాల్ కోర్ట్ వంటి క్రీడా సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.