Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుప్రాంతాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వాన పడే అవకాశం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిజామా బాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కొమ్రం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వాన పడే అవకాశముంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతున్నది. అది ఒరిస్సా వైపు కదులుతున్నది. రాష్ట్రం మీదుగా కిందిస్థాయిలో తూర్పు, ఆగేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడులో అత్యధి కంగా 38.7, అశ్వాపురంలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ య్యాయి. ఆదిలాబాద్ జిల్లా తాళ్ల మడుగులో 6.3 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది.