Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్రైస్తవ మిషనరీలే లక్ష్యంగా బీజేపీ సర్కారు దాడులు చేస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. బాలవికాస సంస్థపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిషనరీ సంస్థలు దేశంలో సేవ చేయకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. క్రైస్తవ మిషనరీ సంస్థలు దేశంలో సేవా కార్యక్రమాలు చేయకుండా కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో బాలవికాస మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయని గ్రామం లేదని తెలిపారు. దశాబ్ధాల కాలంగా గ్రామాల్లో మహిళలకు, వృద్ధులకు సాయం చేస్తుంటే.. కేంద్రం మాత్రం మిషనరీ సంస్ధను ఐటీ దాడుల పేరుతో వేధిస్తున్నదని చెప్పారు. దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోతున్న వారిని పట్టుకోవడం మానేసి... దేశానికి సేవ చేయడానికి విదేశాల నుంచి వస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు.