Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ నిరుద్యోగుల పక్షాన ఆందోళ చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఖండించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారి పోయాయని గుర్తు చేశారు. నయీం, డ్రగ్స్, డేటా చోరీ కేసులు సిట్ అప్పగిస్తే అవన్నీ నీరుగారిపోయాయని విమర్శిం చారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సైతం రాష్ర ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అరెస్టులను ఖండిస్తూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.
ప్రశ్నపత్రం లీకేజీపై బీజేపీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై అధ్యయనం చేసి నిజనిజాలు వెలికితీసేందుకు, పోరాట కార్యాచరణ రూపొందించేందుకు టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షు లు బండి సంజయ్ ప్రకటించారు. దానికి కన్వీనర్‌గా ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్ విఠల్ ఉండనున్నారు. సభ్యులు మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రిటైర్డ్ సీఎస్ చంద్ర వదన్, రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్. కుమార్, అడ్వకేట్ కరుణగోపాల్ ఉంటారు.