Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాకారులను అభినందించిన సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హర్యానాలోని పంచకులలో జరిగిన జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ అధికారులు, సిబ్బందికి16 పతకాలు లభించాయి. జాతీయ స్థాయిలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అటవీ శాఖ అధికారులను బుధవారం హైదరాబాద్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అభినందించారు. జాతీయ స్థాయి క్రీడలకు సంబంధించిన వివరాలను సీఎస్‌కు ఐఎఫ్ఎస్ అధికారి బాలాదేవి వివరించారు. తెలంగాణకు ఎనిమిది బంగారు, రెండు రజత, ఆరు కాంస్య పతకాలు దక్కాయని తెలిపారు. చత్తీస్‌గఢ్, కర్నాకట, కేరళ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయన్నారు.
బిలియడ్స్లో బాలాదేవి రెండు బంగారు పతకాలు సాధించారు. అథ్లెటిక్స్‌లో బి.ఖాజా, ఎం.సునీత, వి.సాంబయ్య, స్విమ్మింగ్‌లో జి.కిష్టాగౌడ్, బి.సక్రు, క్యారమ్స్‌లో ఘాజీ కమాలుద్దీన్లతో పాటు చెస్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో తెలంగాణ అటవీ శాఖ ఉద్యోగులు పతకాలు సాధించారు. క్రీడాపోటీలకు పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ స్వయంగా హాజరై ఉద్యోగులను ఉత్సాహపరిచారు. పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎంసీ. పర్గెయిన్ తెలంగాణ అటవీశాఖ తరపున సమన్యయకర్తగా వ్యవహరించారు.