Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకపూట బడి, మే నెలంతా ఒకేసారి సెలవులు: ఐసీడీఎస్ కమిషనర్‌కు అంగన్వాడీ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేసవి కాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమా నంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒక పూట బడితో పాటు మే నెలంతా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరికీ ఒకేసారి సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూని యన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఐసీడీఎస్ కమిషనర్ భారతి హౌళ్లికేరికి ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, సహాయ కార్యదర్శి జి.పద్మ, ఉపాధ్యక్షు రాలు జి.కవిత వినతిపత్రం సమర్పిం చారు. రాష్ట్రం లో ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రభుత్వం మార్చి 15 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ఒక పూట నిర్వహించాలని ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఐసీడీ ఎస్ పరిధిలో అతి చిన్న వయస్సు పిల్లలతో నడు స్తున్న అంగన్వాడీ కేంద్రాలకు ఇంకా ఎలాంటి ఆదేశా లు రాకపోవడంతో సాయంత్రం వరకు నడుపుతు న్నారని చెప్పారు.
అత్యధిక శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో ఎలాంటి సౌకర్యాలు లేక ఇరుకు గదుల్లో ఉన్నాయనీ, కొద్దిపాటి కేంద్రాలు పక్కా భవనాల్లో ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద వయస్సు పిల్లలు మధ్యా హ్నం తర్వాత ఇంటి వద్ద ఉంటున్నప్పుడు చిన్న వయస్సు పిల్లలను సాయంత్రం వరకు ఉంచాలంటే పిల్లలు తల్లిదండ్రు లు ఇష్టపడటం లేదని చెప్పారు. మే నెలలో ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు, హెల్పర్లు, మినీ వర్కర్లకు 15 రోజులు సెలవులు ఇస్తున్నారని ఇస్తున్నారని తెలిపారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇద్దరి పని ఒక్కరే చేయడం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. సౌకర్యాలు లేకపోవడం తో నిర్వహణ అంత్యంత కష్టంగా మారిందనీ, గర్భిణీ, బాలింతలు, పిల్లలు ఎండలో సెంటర్‌కు రావడానికి ఇబ్బందులు పరిష్క రించాలనీ, మే నెలంతా ఒకేసారి సెలవులివ్వాలనీ అనేక సంవత్సరాల నుంచి కోరుతు న్నప్పటికీ సమస్యను ప్రభుత్వం సమస్యను పరిష్కరించడం లేదనీ, దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారని తెలిపారు.