Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్సుల్తానియా ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉపాది హామీ పథకంలో భాగంగా చేపట్టిన సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులకు గాను ఈ నెల 25లోగా ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్.టి.ఓ.)లు జెనరేట్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ది శాఖల ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారంనాడాయన ఆ శాఖ కమిషనర్ హన్మంతరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవరావుతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డిఆర్డిఓలు, అదనపు డిఆర్డిఓలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. మెటీరియల్ కంపోనెంట్కు సంబంధించి రూ.1,400 కోట్లకుగాను రూ.700 కోట్లకే ఎఫ్.టి.ఓ. జనరేషన్ పూర్తిచేసారని చెప్పారు. మిగిలిన రూ. 700 కోట్లకు సంబంధించి పది రోజులలోగా ఎఫ్.టి.ఓ. జనరేషన్ పూర్తిచేయాలన్నారు.