Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో నడుస్తున్న కొన్ని క్రిస్టియన్ మిషనరీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులను నిర్వహించారు. మిషనరీ కార్యాలయాలు సేకరిస్తున్న నిధులు, వాటి వినియోగాలు, ఇతర వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతన్నారనే ఆరోపణలపై ఐటీ ఈ దాడులు నిర్వహించినట్టు తెలిసింది. జీడిమెట్ల, కూకట్పల్లి, సనత్‌నగర్, అల్వాల్లలోని కొన్ని క్రిస్టియన్ మిషనరీ కార్యాలయాలలో మొత్తం 20 టీమ్‌లతో కూడిన ఐటీ అధికారులు ఈ సోదాలను నిర్వహించినట్టు తెలుస్తున్నది. అలాగే మెదక్ జిల్లాలో కూడా కొన్ని మిషనరీ కార్యాలయాలలో కూడా సోదాలను నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.