Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈతకు వెళ్లి 10వ తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... చల్వాయికి గ్రామానికి చెందిన పైడాకుల మహేష్ స్రవంతి కుమారుడు పైడాకుల అక్షరు(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఒంటి పూట బడులు కావడంతో మధ్యాహ్నం తోటి మిత్రులతో కలిసి స్థానిక రాలమాటు వాగు ప్రాంతానికి ఈత నేర్చుకోవాలనే తాపత్రయంతో వెళ్లారు. గతంలో అక్కడ వాగు కోతకు గురైనందున లోతుగా ఉండటంతో గుర్తించని విద్యార్థులు నీటిలోకి దిగగా అక్షరు ఒక్క మాటున లోతు ప్రాంతానికి వెళ్లడంతో నీటిలో మునిగాడు. తోటి మిత్రులు ఇతరుల సహాయంతో ఒడ్డుకు తీసుకొచ్చినప్పటికీ అక్షరు మృతిచెందాడని స్థానికులు తెలిపారు.