Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ ప్రజలను నమ్మితే..బీజేపీ ఈడీని నమ్ముతోంది : వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
నవతెలంగాణ-జైపూర్
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నూతన నిర్మాణాలు చేపడితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలు చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను నమ్మితే.. బీజేపీ ఈడీని నమ్ముతోందని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్ది, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చెన్నూరులో బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, ఆ పార్టీ కనుమరుగైపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కనిపించవన్నారు. త్వరలోనే గృహలక్ష్మీ పథకం అమల్లోకి వస్తుందని వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న సుమన్‌కు వచ్చే ఎన్నికల్లో రెట్టింపు మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.