Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27, 28న జంతర్ మంతర్ వద్ద ధర్నా
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-ఓయూ
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పార్సిగుట్టలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. ఏప్రిల్ 3న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బీజేపీ తెలుగు రాష్ట్రాల కార్యాలయాల ముందు మహాధర్నా నిర్వహిస్తామని, ఏప్రిల్ 4న హైదరాబాద్, విజయవాడ నగరాలను, రహదారులను దిగ్బంధం చేస్తామన్నారు. అప్పుడు జరిగే పరిణామాలకు బీజేపీదే పూర్తి బాధ్యత అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుంటే బీజేపీ తమకు ప్రధాన శత్రువుగా భావిస్తామని హెచ్చరించారు. మాదిగ పల్లెల్లోకి అడుగుపెట్టే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. వారిని గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి వీఎస్ రాజు, మంతిని సామ్యూల్, డప్పు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.