Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీయస్పీఎస్సీ) నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీరు (ఏఈ) పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ట్విటర్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కండువాలతో ఉన్న నిందితుడు రాజశేఖర్రెడ్డి ఫొటోలను రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ చైర్మెన్ పి.జగన్ ట్విటర్లో పోస్టు చేయగా.. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ రోజురోజుకీ నీచస్థాయికి దిగజారిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత జీవితాలను నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పేపర్ లీకేజీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని డీజీపీ అంజనీ కుమార్కు ఆయన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.