Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. బుధవారం సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహం నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విగ్రహం నిర్మాణం పనులు పరిశీలించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరించునున్నట్టు మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్‌సాగర్ తీరంలో భారీ విగ్రహాన్ని నిర్మించ తలపెట్టినట్టు మంత్రి చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ గడువు సమీపిస్తుండటంతో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువులోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. ఏప్రిల్ 14న అట్టహాసంగా జరిగే ఈ విగ్రహావిష్కరణకు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరవుతున్నందున ఏప్రిల్ 5లోగా అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల పనులకు చార్ట్ రూపొందించుకొని, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, అందుకు సరిపడా మానవ వనరులను పెంచాలని సూచించారు.