Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిరోజు 23,198 మంది గైర్హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1కు 5,05,625 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 4,82,427 (95.42 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 23,198 (4.58 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మొదటి రోజు సీ సెట్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని తెలిపారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఇంటర్ బోర్డు పరిశీలకులు పర్యటించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారని పేర్కొన్నారు.