Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురి అభ్యర్థుల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2016 గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థుల జవాబు పత్రాల ను బయటపెట్టాలని పలువురు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు మెయిన్స్ పరీక్ష మార్కులు ట్యాంపరింగ్ అయ్యాయంటూ పెద్దఎత్తున నిరసనలొ చ్చాయని తెలిపారు. ఫలితాలు వచ్చిన సమయంలో టీఎస్పీఎస్సీలోనే కంప్యూటర్లో పొరపాటు దొర్లిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఫలితాలు తారుమారయ్యాయి. అయితే ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి అప్పటి నుంచి టీఎస్ పీఎస్సీలోనే పని చేస్తున్నారు. కాబట్టి అప్పుడు గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థుల్లో ఇంకా అనుమానాలున్నాయి. కాబట్టి 2016 మెయిన్స్ రాసిన అభ్యర్థులందరి మా ర్కులు, ముఖ్యంగా దిద్దిన జవాబు పత్రాలను బయట పెట్టాలని కోరుతున్నారు. దిద్దిన పేపర్లు మార్కులు, టీఎస్పీఎస్సీ ప్రకటిం చిన మార్కులు వేర్వేరుగా ఉంటాయని చాలా మంది అభ్యర్థుల్లో అనుమా నాలున్నాయి. కంప్యూటర్లో మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడే మార్కులు తారుమారాయ్యాయన్నది వారిలో ఉన్న ప్రధాన అనుమానం. దాన్ని నివృత్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.