Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహుజన సాహిత్య జాతీయ అకాడమీ అవార్డు గ్రహీతలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా మందమర్రికి చెందిన వడ్డాది ప్రమీల శైలజ నాట్యరత్న అవార్డుకు ఎంపిక కాగా, మంథని మండలం గుంజపడుగు కు చెందిన కాశిపేట సంతోష్ మహాత్మ జ్యోతిభాపులే జాతీయ ఆవార్డ్కు ఎంపిక అయ్యారు. ఈ నెల 12న తిరుపతిలో నిర్వహించిన బహుజన రైటర్స్ సౌత్ ఇండియా ఆరో కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డు పొందారు. గురువారం నాడు ప్రమీల శైలజ, సంతోష్ కుమార్‌ను హైదరాబాద్‌లో మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి శాలువా కప్పి సత్కరించారు. భవిష్యత్‌లో మరిన్ని అవార్డులు సాధించాలని కోరారు.