Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టులూ పెంచాలి : రాష్ట్రానికి కేంద్రం లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ భూషణ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 8 నాటికి 2,082 కేసులు రాగా15 నాటికి (వారం రోజుల్లో) 3,264 కేసులొచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్న ప్రాంతాలను గుర్తించాలనీ, ఇన్ఫ్లూయెం జా కేసుల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. జీనోమ్ సీక్వెన్సింగ్ను కొనసాగించాలనీ, ప్రికాషన్ డోస్ ఇవ్వడాన్ని వేగవంతం చేయాలని లేఖలో పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.