Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై వివక్షను వీడాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవాస భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని కోరారు. ఆయా దేశాల కాన్సులేట్ ఆఫీసుల్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడమే కాకుండా ఆన్లైన్లో సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రణాళికలను చేపట్టాలని కోరారు. గల్ఫ్ బాధితుల కోసం తాము హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో మహిళల సాధికారత కోసం చట్టసభలలో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో సముచిత ప్రాధాన్యతనివ్వని ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో చాపర్తి కుమార్ గాడ్గే, దొంత ఆనందం, బోనం ఊర్మిళ, గల్ఫ్ నాయకులు మిద్దెల జితేందర్, ఎస్ యాదయ్య, మడత కిషోర్, సబ్బని సుధాకర్, బేగరీ రవి తదితరులు పాల్గొన్నారు.