Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల నిర్మూలన వేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిందని కుల నిర్మూలన వేదిక(కేఎన్పీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పాపని నాగరాజు, కోట ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్షలాది నిరుద్యోగ అభ్యర్థులను ముంచిన ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను గమనించి నిరుద్యోగులు కేసీఆర్్ను గద్దె దించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.