Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐడీకి చిక్కి...కటకటాల వెనక్కి..
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గత పదమూడేండ్లుగా నేరాలు చేసి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పరమేష్, కడప జిల్లాకు చెందిన రాజేష్‌లు వేరు వేరు నేరాలకు పాల్పడి గత పదిహేను ఏండ్లుగా పోలీసుల నుంచి తప్పిం చుకుని తిరుగుతున్నారు. ఇందులో పరమేష్ ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ. 18 లక్షలు రుణంగా తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరుగు తున్నాడు. ఇతని కోసం తీవ్రంగా గాలించిన సీఐడీ అధికారులు తర్వాత ఈ కేసు ను సీఐడీకి అప్పగించారు. అలాగే మరో కేసులో సాఫ్ట్వేర్ నిపుణుడు రాజేష్ ప్రముఖ కంపెనీలకు చెందిన డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌ను తస్కరించి ఇతర కంపెనీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై హైదరాబాద్ పోలీసులు గతం లో కేసు నమోదు చేయగా అప్పటి నుంచి రాజేష్ తప్పించు కుని తిరుగుతున్నా డు. ఈ రెండు కేసుల్లో నిందితులిద్దరిపై నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఈ పెండింగ్ ఎన్బీ డబ్ల్యూ కేసులను పరిగణనలోకి తీసుకుని సీఐడీకి చెందిన ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగాయి. చివరికి పరమేష్‌ను మహారాష్ట్రలోని చందాపూర్‌లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, రాజేష్‌ను కూడా కడపలో పట్టుకున్నారు. ఇద్దరు పాత నేరస్తులను పట్టుకున్నందుకు గానూ సీఐడీ అదన పు డీజీ మహేష్ భగవత్ తమ అధికారులను అభినందించారు.