Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులే నరేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత నాస్తిక సమాజం సంఘంలో రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న బైౖరి నరేష్‌ను ఆ సంఘం నుంచి తొలగించినట్టు భారత నాస్తిక సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా ఉన్న బైరి నరేష్ సంఘానికి. కమిటికి ఎలాంటి సమాచారం లేకుండా తన వ్యక్తిగత ఆలోచనతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలతో పనిచేస్తూ ఆర్ధిక ఉల్లంఘనలకు పాల్పడినందున అతనిపైచర్య తీసుకున్నదని తెలిపారు. అయ్యప్ప జననంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, వివిధ వార్తా ఛానళ్లలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో అతన్ని కమిటీ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవి నుంచి పక్కకు పెట్టినట్టు ప్రకటించారు.