Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెడ్ బాడీ కోసం కుటుంబం ఎదురుచూపులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్ వెంకటేశ్వర్లు (39) దుబాయ్లో మూడు రోజుల క్రితం మరణించారు. ఆయన స్వస్థలం మల్లెల చెరువు మండలం కప్పలకుంట తండా. ఉపాధి కోసం దుబారు వలస వెళ్లిన వెంక టేశ్వర్లు అక్కడ కూలీగా పనిచేశాడు. ఏం జరిగిందో గానీ మూడు రోజుల క్రితం మరణించినట్లు ఆయన భార్య ధరావత్ రమాదేవికి సమాచారం అందింది. దీంతో ఆయన కుటుంబంతోపాటు కప్పలకుంట తండా విషాదం లో మునిగిపోయింది. ధరావత్ వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని తమకు అప్ప గించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని రప్పించడానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతున్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వెంక టేశ్వర్లు భౌతికకాయాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని వారు వేడుకుంటున్నారు.