Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు డీజీపీ అంజనీకుమార్ పిలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపుతో పాటు క్రీడలు, దేహధారుఢ్యం పట్ల కూడా పోలీసులు శ్రద్ధ వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ పిలుపు నిచ్చారు. గురువారం ఆర్బీవీఆర్ పోలీసు అకాడమీలో రిటైర్డు పోలీసు సూపరింటెం డెంట్ మహ్మద్ ఖాసిం తాను పోలీసు అధ్లెటిక్ మీట్లో సాధించిన బంగారు పతకాలను పోలీసు మ్యూజియంకు ప్రదర్శన కోసం బహూకరించారు. ఈ సందర్భంగా జరిగిన ఖాసిం సత్కార సభలో డీజీపీ మాట్లాడుతూ శారీరకంగా పోలీసులు ఫిట్‌గా ఉంటేనే వారి దైనందిన విధుల్లో రాణించ గలరని అన్నారు. పోలీసులు తమ విధి నిర్వహణకు తమ విజ్ఞానాన్నే గాక, అవసరమైతే దేహధారు ఢ్యాన్ని కూడా ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు ప్రతి రోజు వారు ఏదో ఒక క్రీడలో పాల్గొనడం, శారీరక సమానత్యాన్ని పెంచడానికి అవసరమైన వ్యాయాన్ని చేయడం అత్యవసరమని అన్నారు. అప్పుడే మానసికంగా , శారీరక సౌష్టవా న్ని పోలీసులు కలిగి ఉంటారని చెప్పారు. కింది స్థాయి కానిస్టేబుల్ మొదలుకుని ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారుల వరకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు. తన పోలీసు జీవితంలో మహ్మద్ ఖాసిం వివిధ హౌదాలలో పోలీసు విధులను నిర్వహి స్తూనే మరో వైపు క్రీడల్లో తన సామర్థ్యాన్ని చాటు కున్నారని ఆయన అభినందించారు. ఆయన సాధిం చిన 10 బంగారు పతకాలు, ఆరు వెండి పతకాల ను అకాడమీలోని పోలీసు మ్యూజియంలో ప్రదర్శిం చడానికి ఇవ్వడం యువ పోలీసుల్లో స్పూర్తిని నింపడానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. రిటైర్డు ఎస్పీ మహ్మద్ ఖాసిం మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ఒక పక్క శాంతి భద్రతలు, నేరాల అదుపులో దృష్టిని సారిస్తూనే మరో వైపు అథ్లెటిక్స్ లో సైతం ఆసక్తిని చూపానని అన్నారు. ముఖ్యం గా జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగిన అథ్లేటికటిక్ మీట్స్లలో తాను గెలుపొందిన బంగారు, వెండి పతకాలను ఇంట్లో ఉంచుకోవడం కంటే పోలీసు మ్యూజియంలో ఉంచడం వల్ల ఇతర పోలీసులకు ప్రేరణ కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అనంతరం మహ్మద్ ఖాసింను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు రాష్ట్ర పోలీసు క్రీడ లు, వెల్ఫేర్ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, పోలీసు అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య , ఐజీ కమలాసన్ రెడ్డి , అధికారులు సన్మానించారు.