Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనివర్సిటీల్లో అధ్యాపక ఖాళీల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్లో బిల్లును ఆమోదించిన నేపథ్యంలో... అదే విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం కూడా అనుసరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
మన రాష్ట్ర విధానానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆమోదం లభిస్తోందనీ, కానీ రాష్ట్ర గవర్నర్కు మాత్రం ఈ విధానం ఎందుకు అర్థం కావడం లేదు అని వినోద్ కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర క్యాబినెట్ తాజాగా నిర్ణయం తీసుకున్నదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.