Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,541 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు జనవరి వేతనాల బడ్జెట్ రూ.16.80 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి జీతాలందేలా జిల్లా ఇంటర్ విద్యా అధికారులు, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని కోరారు. జీతాల బడ్జెట్ విడుదల చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ-475) రాష్ట్ర అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేశ్ ధన్యవాదాలు తెలిపారు.