Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న బాధ్యులను విధుల నుంచి తప్పించాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైతే గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు. లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని తెలిపారు.