Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెండోరోజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2కు 4,34,862 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 4,20,195 (96.63 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 14,667 (3.37 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. రెండో రోజు బి సెట్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇంటర్ బోర్డు పరిశీలకులు పర్యటించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారని తెలిపారు. కరీంనగర్లో ముగ్గురు, వరంగల్‌లో ఒకరు చొప్పున నలుగురు మాల్‌ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.