Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుబాటులోకి రానున్న 300 పడకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రోజు రోజుకు క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రభుత్వం చేపడుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో రెండు నుంచి మూడు శాతం మందిలో క్యాన్సర్ బయటపడుతున్నట్టు గణాంకాలు చెబుతు న్నాయి. నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గత నాలుగైదు నెలలుగా ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజల వద్దకే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక స్క్రీనింగ్ వాహనం ద్వారా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, హైదరా బాద్ తదితర జిల్లాల్లో స్క్రీనింగ్ క్యాంప్‌లు నిర్వహించారు.
ప్రయివేటులో వేలాది రూపాయలు ఖర్చయ్యే మమ్మోగ్రఫీ, పాప్ స్మియర్, ఆల్ట్రాసౌండ్ అబ్డామన్ వంటి పరీక్షలను ప్రజల ఇంటి వద్దే చేస్తుండడం ఫలితాలని స్తున్నది. రోగ నిర్దారణ పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్టు తేలిన వారికి తదుపరి చికిత్సను హైదరాబాద్ రెడ్‌హిల్స్ లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అంది స్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య రోజు వారీగా 500 నుంచి 600 వరకూ ఉంటున్నది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న 450 బెడ్లు సరిపోవడం లేదు. ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో నూతనంగా నిర్మించిన 300 పడకల బ్లాక్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద రోగులకు 750 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త బ్లాకులోకి మెడికల్ ఆంకాలజీ సేవలైన పీడియాట్రిక్ ఆంకాలజీ, అడాల్ సెంట్ వార్డు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, డే కేర్ కీమోథెరపీ వంటి వాటిని తరలించనున్నారు. ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదిన 92 మంది డాక్టర్లు, నర్సులను నియమించుకోగా, మరో 252 మంది రెగ్యులర్ స్టాఫ్ కోసం ప్రభుత్వం అనుమతించింది. మెడికల్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.
సకాలంలో గుర్తించాలి ... డాక్టర్ జయలత
క్యాన్సర్ రోగాన్ని సకాలంలో గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత ఈ సందర్భంగా తెలిపారు. ఐదు నెలల నుంచి స్క్రీనింగ్ వాహనం ప్రతి రోజూ వేలాది మందికి పరీక్షలు చేస్తూ జిల్లాల్లో సేవలంది స్తున్నదని చెప్పారు. అనుమానిత లక్షణాలున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని సూచించారు.