Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబాయిలో అందుకున్న డైరెక్టర్ రామేశ్వర్రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు 'గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు-2023' దక్కింది. ఇప్పటి వరకు ఈఎస్సీఐ ఏడు గోల్డెన్ పీకాక్ అవార్డులను సొంతం చేసుకోగా ఇది ఎనిమిదోది కావడం విశేషం. దుబాయిలోని హడ్టూర్ ప్యాలెస్లో యూనైటెడ్ ఎమిరేట్స్ క్యాబినెట్ మంత్రి షేక్ నహయాన్ బిన్ ముబారక్ ఆన్ నహయాన్ చేతుల మీదుగా గురువారం ఈఎస్సీఐ డైరెక్టర్ జి.రామేశ్వర్రావు అవార్డును అందుకున్నారు. ఈఎస్సీఐకి గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కడం గర్వకారణంగా ఉందని జి.రామేశ్వర్రావు తెలిపారు. 1981లో ఏర్పాటైన ఈఎస్సీఐ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, పర్యావరణ రంగంలో క్వాలిటీ ట్రైనింగ్, ఎడ్యూకేషన్ అందిస్తోందని చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఆర్గాన్ అయిన ఈఎస్సీఐ స్వతంత్ర సంస్థగా జాతీయ స్థాయిలో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.