Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాం
- ఉద్యోగులు, వ్యాపారులతోనూ శాఖలు వేస్తున్నాం :ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో 2024 నాటికి లక్ష గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ(ప్రధాన కార్యదర్శి) కాచం రమేశ్ తెలిపారు. తెలంగాణ లోనూ వేగంగా విస్తరిస్తు న్నామనీ, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతులతో ప్రత్యేకంగా శాఖలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ, తమిళ నాడు, కర్నాటక క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయూష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో ఆరేడు గ్రామాలను కలిపి 1616 ఉపమండలాలను గుర్తించామనీ, 1138 రెగ్యులర్ శాఖలు, 280 శాఖ లు వారానికి, నెలకోసారి సమావేశం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రం లోని పట్టణాల్లో 10వేల జనాభాకొకటి చొప్పున 1447 సేవాబస్తీలను (మురికివాడలను) విభజించామనీ, 1075 బస్తీల్లో శాఖలు జరుగుతున్నా యని తెలిపారు. మురికివాడల్లో తమ కార్యకర్తలు నిరంతరం యాక్టివ్‌గా ఉండి సంఫ్‌ును విస్తరిస్తున్నారని చెప్పారు. త్వరలో 500 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు హైదరాబాద్ లో రెండు శిక్షణాశిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. నైజాం విముక్త అమృతోత్సవ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను కలిశామన్నారు. సెప్టెంబర్ 17న 491 మండల కేంద్రాల్లో త్రివర్ణపతాకావిష్కరణలో 31వేలకుపైగా మంది పాల్గొన్నారని చెప్పారు. జనవరి ఒకటో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రంలోని ఏడువేల గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి 15లక్షల కుటుంబాలకు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను వివరించే కరపత్రం, పుస్తకాలను పంచామని తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 61 యువ సమ్మేళనాలు జరిగాయనీ, అందులో లక్షన్నరకుపైగా విద్యార్థులు పాల్గొన్నా రని చెప్పారు. స్వ ఆధారితంగా (స్వభారత్, స్వదేశీ, స్వజాతీకరణ...) ముందుకెళ్తున్నామని చెప్పారు. సంఫ్‌ు పై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నా రనీ, అఖండ భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని చెప్పారు. తెలంగాణలో ప్రతి జిల్లాలో ఐదారు గ్రామాలను ఎంచుకుని సమగ్రంగా సర్వేలు చేయాలని తమ శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామాల్లో అక్షరాస్యత పెంచడం, శాఖ సభ్యులు ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించు కోవడం, దేవాలయాల పునరుద్ధరణ, పాఠశాలల్లోని సమస్యల ను పరిష్కరించడం, పర్యావరణ పరి రక్షణ ఆవశ్యకత, విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించడం, వైద్యపరంగా సహకారం అందేలా చూడటం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల అవసరా లకు అనుగుణంగా పనిచేస్తూనే సంఫ్‌ును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.