Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని శాంతియుత నిరసన చేపట్టిన బండి సంజయ్‌కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ కార్యకర్తలపైనా, మీడియా ప్రతినిధులపైనా పోలీసులు లాఠీచార్జికి పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. దోషులను శిక్షించే వరకు ఉద్యోగార్థులు, నిరుద్యోగుల తరఫున తాము పోరాటం చేస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు.